గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
భూమి కోసం భుక్తి కోసం ఈ పేద ప్రజల విముక్తి కోసం విప్లవోద్యమంలో పనిచేస్తూ అమరులైన అమరులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
మండలంలోని కాచన పల్లి, ముత్తాపురం, మోదుగుల గూడెం, రోల్లగడ్డ, గుండాల, కొడవటంచ తదితర గ్రామాలలో జరిగిన వర్ధంతి సభలలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవు నూరి మధు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ 1969 లో సిపిఎం నయా రివిజనిజం నుంచి బయటకొచ్చి సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకత్వంలో గోదావరి లోయ పరివాహ ప్రాంతాల్లో దున్నేవానికి భూమి కావాలని నినాదంతో లక్షలాది ఎకరాల పోడు భూములు కొట్టించి వాటి పట్టాల కొరకు అనేక పోరాటాలు నిర్వహించామని ఈ పోరాటాలు భాగంగా రాజ్యం చేతిలో అనేకమంది అమరులుతమ విలువైన ప్రాణాలను పేద ప్రజల కోసం అంకితం చేశారని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధులై పోరాడాలని పిలుపునిచ్చారు.
త్వరలో రాష్ట్రంలోజరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు విప్లవ పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ గుండాల మండల కార్యదర్శి అరేం నరేష్, ఆళ్లపల్లి మండల కార్యదర్శి పూనెం రంగన్న, యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, ఈ సం కృష్ణ, పెండకట్ల పెంటన్న,ఊకే బాబు పరిశిక రవి, ఈసం మంగయ్య, జరుపుల కిషన్, భాను తులాలు, బచ్చల సారన్న, మల్యాల మల్లేష్, కల్తి నరసింహారావు, గొగ్గెల శ్రీను, అట్టికం శేఖర్, ఎనగంటి లాజర్, ఎనగంటి చిరంజీవితదితరులు పాల్గొన్నారు