40మంది రౌడీ షీటర్ల మరియు సస్పెక్ట్స్ లకు కౌన్సెలింగ్ చేసిన అనంతరం బైండోవర్.
జైపూర్, నేటి ధాత్రి:
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జైపూర్ ఏసీపీ కార్యాలయంలో శ్రీరాంపూర్ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్, జైపూర్, భీమరాం పోలీస్ స్టేషన్లకు సంబంధించిన రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్స్ లకు జైపూర్ ఏసీపీ మోహన్ కౌన్సిలింగ్ చేసిన అనంతరం బైండోవర్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏసీపీ మోహన్ మాట్లాడుతూ….
రౌడీ షీటర్ల జీవన విధానంతో పాటు, ప్రస్తుత వారి కుటుంబం స్థితిగతులను గురించి అడిగి తెలుసుకుని, గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు నేర ప్రవృత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు.ఎన్నికల సమయంలో చిన్న గొడవలకు దిగినా, శాంతి భద్రతలకు మరియు ప్రజల స్వేచ్ఛ హక్కులకు భంగం కలిగిస్తూ వారిపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, తీరు మారకపోతే కేసులు తప్పవని పిడి యాక్ట్ పెట్టేందుకు సైతం వెనకాడబోమని అన్నారు ప్రతి 6 నెలలకు ఒక్కసారి చెడు ప్రవర్తన కలిగిన వారిని బైండోవర్ చేయడం వలన వారిపై పోలీస్ నిఘా ఉంటుందని వారి ప్రతి కదలికలు మరియు ప్రవర్తన గురించి తెలుసుకొవడం జరుగుతుందని, బైండోవర్ కాలంలో ఏదైనా నేరానికి పాల్పడినట్లయితే జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరు సత్ప్రవర్తనతో ఉండి శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని తెలిపారు. ఎన్నికల సమయంలో గొడవలకు దిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇట్టి కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ రమేష్ బాబు , జైపూర్ ఎస్సైలు ఉపేందర్,నాగరాజు శ్రీరాంపూర్ ఎస్సై రాజేష్ , భీమరాం ఎస్సై రాజవర్ధన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.