
కరపత్రాలతో విస్తృత ప్రచారం చేస్తున్న బిఎస్ఎస్, డివైఎఫ్ఐ, ఏబిఎస్ఎఫ్
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని గోవిందాపూర్ గ్రామంలో ఓటు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఓటును అమ్ముకోకు బానిసగా మారబోకు అవేర్నెస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఎస్ ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మోగ్గం సుమన్, డివైఎఫ్ఐ జిల్లా సహా కార్యదర్శి మంద సురేష్, ఏబిఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ నాగుల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు కల్పించింది కులమత వర్గ లింగ బేధాలు లేకుండా ఈ రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది అని అన్నారు, ఈ ఓటు హక్కు ద్వారా ఈ సమాజంలో సమానత్వం ఉందని తెలియజేశారు, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కరెన్సీ నోటు మద్యం బాటిల్ లకు, బిర్యానీ ప్యాకెట్లకు అమ్ముకోకూడదని నియోజకవర్గంలో నికార్సైన వ్యక్తిని ప్రజలు ఎంచుకోవాలని యువకులకు వివరించారు, ఓటును అమ్ముకోవడం మూలంగా ఈ భారత సమాజానికి ఎంతో ప్రమాదం ఉందని వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీలు కరెన్సీ నోట్లతో మభ్యపెడుతూ ప్రజల నుండి ఓట్లు దండుకునే చేస్తారని ఈ విషయాన్ని పసిగట్టి నిజాయితీగా నచ్చిన వ్యక్తికి ప్రజా సంక్షేమ కోసం పాటుపడే వ్యక్తికి ఓటు వేయాలని ఈ సందర్భంగా కరపత్రాల ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పౌరులు, ప్రజలు పాల్గొన్నారు.