పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్,బిజెపి పార్టీకు చెందిన 50 మందికి పైగా బీఅర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మంగళవారం రోజున బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు.వారిని బీఅర్ఎస్ పార్టీ కండువ కప్పి సాధారంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని,వారికి ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాన్నారు. బీఅర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలిచాయన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సస్యశ్యామలంగా మారిందన్నారు.ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని బీఅర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.సాధారణ ఎన్నికలలో బీఅర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఎవరెన్ని కుట్రలు పన్నినా బీఅర్ఎస్ పార్టీ గెలుపును అపలేరన్నారు.పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు అల్లం సత్యనారాయణ,హరికాల శ్యామ్రావు,బయ్య రమేష్,బొజ్జo రాజు,దోబిల రాజు,బిజెపి నాయకులు బాణాల అనిల్,బోజ్జo రాము,రాజేష్,శ్రీకాంత్,తాల్ల రాంప్రసాద్,శ్రీకాంత్,రాసమల్ల రాజుకూమార్,పల్లెబోయిన సిద్దు,బండి ఉదయ్ కరణ్,సాయి కిరణ్,రఘుపతి, బోల్లికొండ మనోహర్,చిట్టిమల్ల లక్ష్మణ్,తాళ్ళ బన్నీ,బోజ్జం శ్రీరామ్,దుమాల బన్నీ,విజయ్ లతో పాటు 50 మందికిపైగా చేరారు.ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ,నాయకులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.