గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని సీతారాంపూర్ గ్రామ పంచాయితీ పరిధి లో బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వైనాల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గండ్ర వెంకట రమణా రెడ్డి గెలుపు కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఓట్లు అభ్యర్థించడం జరిగింది .ఇందులో భాగంగా ముఖ్య అతితులుగా భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొలుసాని లక్ష్మీనరసింహ రావు.వారి వెంట మండల పార్టీ అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రామంచ భద్రయ్య, ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు,యూత్ సభ్యులు,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.