
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన యువకులు కాంగ్రెస్ బిజెపి పార్టీలను వీడి రాష్ట్ర యువజన నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి గారి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.
వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన రాష్ట్ర యువజన నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి .
పార్టీలో చేరిన వారు మాట్ల సుమన్, కొంపెల్లి నరేష్, కడారి కిరణ్, రాపల అనిల్, రాగల నితిన్,దండెబోయిన రవి,
అనంతరం వారు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో గండ్ర రమణన్న గారి గెలుపుకు కృషి చేసి, గెలుపులో మేము భాగమావుతాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారరావు, మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆకుల తిరుపతి, మండల ఉపాధ్యక్షులు కేశెట్టి ప్రకాష్, గ్రామశాఖ అధ్యక్షుడు గంపల వేణు, వార్డు సభ్యులు కొంపెల్లి శంకర్,నాయకులు గాజర్ల చింటూ, మాట్ల ప్రేమ్, సోషల్ మీడియా కన్వినర్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.