
11 మెన్ కమిటీ సభ్యులు కాపు కృష్ణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
సింగరేణి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గోదావరి ఖని లో కేంద్ర కార్యవర్గ సమావేశం ఆర్ జి వన్ ఏరియాలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీబీజీకేఏస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు, జనరల్ సెక్రటరీ మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగర్ల మల్లయ్య పాల్గొన్నారు. గోదావరిఖనిలో నిర్వహించిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో తెలంగాణ బొగ్గు గ ని కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా 11 మెన్ కమిటీ సభ్యులు కాపుకృష్ణ పాల్గొని కార్మికులకు 250గజాల స్థలాలు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇచ్చే విదంగా మనిపేస్టో పెట్టాలని మాట్లాడం జరిగింది. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలలో పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా టీబీజీకేస్ నాయకులు కార్యకర్తలు ముందుండాలని వారు విజ్ఞప్తి చేశారు . కొత్తగూడెం నుండి రజాక్, వీరభద్రం, మురాద్, విప్లవ్ తదితరులు పాల్గొన్నారు.