
వరంగల్ ఉమ్మడి జిల్లా, నేటిధాత్రి బ్రేకింగ్ న్యూస్…
వరంగల్ ఉమ్మడి జిల్లా,నేటిధాత్రి :
పరకాల కాంగ్రెస్ పార్టీలో మొదలైన లొల్లి మొదలైంది.ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పరకాల టికెట్ కేటాయించడం పట్ల నియోజకవర్గ ఇన్చార్జి ఇనాగాల వెంకట్ రామ్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు
అసంతృప్తితో ఉన్నారు. గత 12 సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి దీటుగా వెంకట్రామ్ రెడ్డి కార్యకర్తలకు సేవలు చేశారు.పార్టీ టికెట్ ను తనకే టికెట్ వస్తుందని శుక్రవారం సాయంత్రం వరకు ఆశపడ్డ ఇనగాలకు నిరాశే ఎదురైంది.తమ నాయకునికే పార్టీ టికెట్ కేటాయిస్తారని ఆశపడ్డ కార్యకర్తలకు,నాయకులకు ఆశలు నిరశలయ్యాయి.కాగా పార్టీ టికెట్ తనకు కేటాయించకపోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు,కార్యకర్తలు,ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకొని తన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొంటున్నట్లు సమాచారం.
పార్టీని వీడైనా అదే పరకాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.