
ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్
గుండాల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా కాంతారావు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శుక్రవారం ప్రచారం నిర్వహించి మ్యాని ఫెస్టో కరపత్రాన్ని ప్రతి ఒక్కరికి అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ
బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసా అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. దేశంలో ఇంటింటికి మంచినీళ్లు ఉచిత విద్యుత్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మాత్రమే అన్నారు.
తాజాగా ఎన్నికల మ్యానిఫెస్టో తో ప్రతిపక్షాల దిమ్మ తిరిగిపోయింది అన్నారు. దేశం మెచ్చిన పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి నెంబర్ వన్ స్థానంలో తెలంగాణను నిలబెట్టినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెట్టే మాయమాటలతో గ్రామాలకు వస్తున్నారని అన్నారు.
బిఆర్ఎస్ తోనే ప్రజల సంక్షేమ అని అన్నారు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం బిఆర్ఎస్ పార్టీ ఎంతో గాను కృషి చేస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని ఆయన అన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పేదల జీవితాలలో వెలుగులు నిండయని అన్నారు సీఎం కేసీఆర్ సహకారంతో పినపాక నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయని అన్నారు.
అభివృద్ధి కోసం ప్రజలు బిఆర్ఎస్ కు ఓటు వేసి మరో మారు సీఎం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు వివరించారు.