
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ* అధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కొమురం భీమ్ వర్ధంతి** వేడుకలు ఘనంగా జరిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రచార కార్యాదర్శి పుల్ల మల్లయ్య విచ్చేసి పూలమాల వేసి నివాళులు* అర్పించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీలైన గిరిజనులను చైతన్య వంతులను చేస్తూ, వారి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశాడని తెలిపారు.దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారన్నారు.అమరుడైన కొమురం భీమ్ ఆశయాలను* నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని యువతను కోరారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి గుర్రపు రాజేందర్, టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్ మండల నాయకులు గుర్రపు రాజ మొగిళి గురుకుంట్ల కిరణ్ గడ్డం సదానందం నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.