
*కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు రైతులు ఎవరు నమ్మవద్దు
*నమ్ముతే రైతులు ఆత్మహత్యలే…
వీణవంక. (కరీంనగర్ జిల్లా)
నేటి దాత్రి: వీణవంక మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో కరోనా కన్నా డేంజర్ కాంగ్రెస్ పార్టీ రైతన్నలు కాంగ్రెస్ కుట్రలను గమనించాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ ఆదేశాలమేరకు రైతుబంధుపై కాంగ్రెస్ అక్కసు.. పథకాన్ని నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ రాయడం పట్టుకుని వ్యక్తం చేస్తూ అన్ని మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.
వారు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ను నమ్మితే నట్టేట మునగడం ఖాయం అంత పెద్ద కరోనా విపత్తులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నతంగా ఆలోచించి రైతుబంధు పథకాన్ని ఆగనివ్వలేదు కని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో కావాలని రైతుల ఇబ్బంది కూడా చేసే విధంగా ఆపాలని ఎన్నికల కేంద్రానికి లేఖ రాయడం రైతులు మర్చిపోవద్దన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని కరోనా దెబ్బకు ప్రపంచం విలవిల్లాడుతున్నా… తెలంగాణలో ఏడు వేల పైచిలుకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశామని కానీ
కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల కోసం ఆన్ గోయింగ్ పథకాన్ని ఆపాలంటూ ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాసి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది.
అధికారం మీద తప్ప కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద గానీ, వ్యవసాయం మీద గానీ ప్రేమ లేదు.నాడు కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తిన్నాం .. కరువుతో అల్లాడి అంబలి కేంద్రాల కోసం ఎదురుచూశాం అని అన్నారు.
పచ్చగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆకలిచావులు, ఆత్మహత్యలు, కరంటు కోతలు, వలసలకు నిలయమైంది.అధికారం కోసం కర్ణాటకలో అడ్డగోలు హామీలు ఇచ్చి ఆరు నెలలు కాకముందే చేతులు ఎత్తేసింది.ఇప్పుడు రైతుబంధు వద్దని లేఖ రాయడం కాంగ్రెస్ అనైతికతకు నిదర్శనం అన్ని మండలాల కేంద్రంలో దిష్టి బొమ్మ దహనం చేశా రు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి, జడ్పీసీలు వనమల సాధవ రెడ్డి సర్పంచుల ఘోరం అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి గంగాడి తిరుపతిరెడ్డి నీల కుమారస్వామి మర్రి స్వామి సత్యనారాయణ గెల్లు శ్రీనివాస్ భానుచందర్ సమ్మయ్య ఎం.డి ఆసిన్ మహేష్ వెంకటస్వామి ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.