
17 ఏళ్ల తరవాత కలిసిన స్నేహబంధం.
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని
భూపాలపల్లి జిల్లా పరిషత్ పాఠశాల లో 17ఏళ్ల తీపి జ్ఞాపకాలను స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 2005-06విద్యా సంవత్సరం నాటి పూర్వపు విద్యార్థులు
17 ఏళ్ల తర్వాత వారు చదువుకున్న పాఠశాలలో కలుసుకుని ఆనందంగా గడిపారు.
వాట్సప్ వేదికగా గత నెల రోజుల నుంచి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఒకరోజు ముందుగానే భూపాలపల్లి కి చేరుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. వారు చదువుకున్న రోజుల్లో కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సందడి చేశారు. చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ
గతానికి ఇప్పటికీ పాటశాల ఎంతో అభివృద్ది జరిగిందని తెలిపారు.
తమ లాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మృతి చెందిన స్నేహితులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. పూర్వపు ప్రథనోఉపాధ్యాయులు మందల రవీందర్ రెడ్డి తో పాటు ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, సంతోష్ రెడ్డి,కృష్ణమూర్తి, నాగేశ్వర్ రావు, ఉపాధ్యాయురాలు మాధురి, విజయ, తిరుమల
సుధాకర్,సంతోష్,రవీందర్,నరేందర్ షర్మ, అబ్దుల్ రహీమ్ తదితర ఉపాధ్యాయులు మరియు
డి.ఈ ఓ ఆఫీస్ స్టాఫ్ ఎ.డి రాజేందర్, సెక్టరల్ ఆఫీసర్ లక్ష్మణ్, కిషన్ రావు, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.