వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి పట్టణంలో విజయదశమి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం లో షమీ పూజలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ ఉoగుళం తిరుమల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డిని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు ఆలయ ఆవరణలో డ్రైనేజీ నిర్మాణం కొరకు అంగడి రాఘవేంద్ర50 వేల రూపాయలు విరాళం ఇచ్చారని చైర్మన్ తెలిపారు ఆలయ అభివృద్ధిపై చైర్మన్ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంబడే ఆలయానికి తన ఒక నెల వేతనం ఇస్తానని తెలిపారు అదేవిధంగా ఆలయం అభివృద్ధి కొరకు దాదాపు మూడు కోట్ల అవసరం ఉన్నదని ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు పూజ కార్యక్రమంలో అంగడి నరేందర్ మరిడి బద్రీనాథ్ బచ్చు వెంకటేష్ వాసవి క్లబ్ గోల్డ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి రవి భక్తులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం షమీ పూజలో మంత్రి నిరంజన్ రెడ్డి
