పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ

డా”ప్రత్యూష

గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో డా ప్రత్యూష ఆధ్వర్యంలో బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ
ప్రకృతిలో లభించే తీరొక్క పూలను వరుసలుగా పేర్చి,ప్రకృతినే దేవతగా భావించి, పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో మరెక్కడాలేని రీతిలో తెలంగాణకే ప్రత్యేకమైన రంగురంగుల పూల పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే బతుకు దెరువును మెరుగు పరిచే అమ్మ అని అర్థం. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం బతుకమ్మ పండుగ విశిష్టత. విభిన్నమైన పూలతో బతుకమ్మను చేసి, పూజించి, తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో,సంప్రదాయంగావేడుకగా జరుపుకునే పూలపండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు జాతరలా సాగే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల బతుకు తెరువును ఆవిష్కరిస్తుందని అన్నారు ఈ కార్యక్రమం లో హెచ్ ఓ సరోజన ఎఎన్ యం లు రాజశ్రీ ఆశ వర్కర్స్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *