వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి పట్టణంలో విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించినందుకు తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా ఒక ప్రకటనలో మంత్రి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి అన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ జిల్లా విలేకరుల సమావేశం నిర్వహించి డిపిఆర్ఓ ద్వారా సమాచారం సేకరించి విలేకరులుగా పనిచేస్తున్నారా లేదా అని గుర్తిం చి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే బాగుండేదని ఆయన అన్నారు దినపత్రిక లలో వార్తలు రాసే విలేకరులకు అన్యాయం జరిగిందని వార్తలు రాసే విలేకరులను గుర్తించి ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి నిరంజన్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ను ఒక ప్రకటనలో కోరారు
విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినందుకు మంత్రి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన జన సమితి
