ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందీ.
మద్రాస్ హైకోర్టు తీర్పునకు అభినందనలు.
టీ .ఏ .జి .ఎస్. కార్యదర్శి పోలం రాజేందర్.
మహా ముత్తారం నేటి ధాత్రి.
తమిళనాడు రాష్ట్రంలోని వాచాతిపల్లి గ్రామ ప్రజల పోరాటానికి అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాలు జరపాలని ఏఐకేఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్, మహిళా సంఘం, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీలు ఉమ్మడిగా ఇచ్చిన పిలుపులో భాగంగా మహా ముత్తారం మండల కేంద్రంలో 31 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి అభినందనలు తెలియజేయాలని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలం చిన్న రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలోని వాచాతి పల్లి గ్రామ ప్రజలు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని తేదీ 1992 జనవరి 20న ఫారెస్ట్ అధికారులు పోలీసు రెవెన్యూ మూడు డిపార్ట్మెంట్ లకు సంబంధించిన అధికారులు ఊరిలోకి చొరబడి,, ఎర్రచందనం స్మగ్లింగ్ తో ఎలాంటి సంబంధం ఆ గ్రామ ప్రజలకు లేకపోయినా ఆ గ్రామం పై దాడి చేసి వారి ఆస్తులను మొత్తం ధ్వంసంచేసి ఇళ్లను కూల్చివేసి అంతటి తోటి ఆగకుండా 18 మంది యువతులను ఆ గ్రామం నుంచి ఎత్తుకెళ్లి మూడు డిపార్ట్మెంట్ లకు సంబంధించిన 269 మంది అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడడం జరిగింది అని వారన్నారు. సామూహిక అత్యాచారానికి గురైన మహిళలు ఆ గ్రామ ప్రజలు అవమానానికి గురై కృంగిపోకుండా, ఏ నేరం చేయని మాపై ఇలాంటి పాసవికమైన మానవ మృగాలు దాడి చేయడం ఏమిటని వారు 31 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేశారని, దీని ఫలితంగా మద్రాస్ హైకోర్టు 269 మంది దోషులను కఠినంగా శిక్షించాలని తీర్పునిస్తూ అత్యాచారానికి గురైన బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వారన్నారు, ఈ మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన 269 మంది దోస్తులలో 54 మంది దోసెలు చనిపోయారని, 126 మంది అటవీ సిబ్బంది, 84 మంది పోలీసులు, ఐదుగురు రెవెన్యూ అధికారులు దోషులుగా ఉన్నట్టు, అంతేకాకుండా దీనికి కారణమైన సంబంధిత కలెక్టర్, ఎస్పీ, అటవీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలియజేసిందని అన్నారు, దృడ సంకల్పంతో చేసిన పోరాటం 31 సంవత్సరాలకు ఫలించి న్యాయం గెలిచిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇది భారతదేశంలో చారిత్రాత్మకమైన తీర్పులలో ఒకటని ఇది ఒక మైలు రాయలుగా మిగిలిపోతుందని వారు అభిప్రాయపడ్డారు, ప్రభుత్వ అండతోటి అమాయకమైన ప్రజలపై దాడులు చేస్తున్న అధికారులకు ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిదని వారన్నారు. సుదీర్ఘ కాలం పాటు 31 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసిన వాచాతి పల్లి గ్రామ ప్రజలకు వారికి అండగా సపోర్టుగా నిలబడిన ట్రైబల్ అసోసియేషన్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తుందని వారన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో రెవెన్యూ, పోలీసు అధికారుల అండతో ఫారెస్ట్ అధికారులు ఆదివాసులపై మానవత్వాన్ని మర్చిపోయి అత్యంత క్రూరంగా దాడులు చేస్తూ హింసకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, ఇకనైనా ఆదివాసులపై అమాయకమైన ప్రజలపై దాడులు మానుకోవాలని హితవు పలికారు లేదంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మహిళా సంఘాలు బలంగా పనిచేస్తున్నాయని, బాధితుల పక్షాన నిలబడుతున్నాయని, తమిళనాడులో జరిగినటువంటి పరిణామాలే తెలంగాణ రాష్ట్రంలో కూడా చవి చూడవలసి వస్తుందని, దాడులకు పాల్పడుతున్న అధికారులను వారు హెచ్చరించారు.
దేశంలో అమాయక ప్రజలపై ఈ దాడుల పరంపర కొనసాగడానికి యాదృచ్ఛికంగా అధికారులు చేస్తున్న దాడులు కావని, పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పాలకులే ఈ దేశంలో అధికారంలోకి రావడం జరుగుతుందని, ప్రభుత్వ అధికారులను ప్రేరేపించి పేద ప్రజలపై దాడులు చేయించి అటవీ నుంచి గెంటివేసి ఖనిజ సంపాదన మొత్తం పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి కుట్ర సాగుతుందే తప్ప ప్రజల సంక్షేమం కోసం, ప్రభుత్వ ఆస్తులని కాపాడడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి కాదనే విషయాన్ని ప్రభుత్వ అధికారులు గ్రహించాలని, బహుళ జాతి కంపెనీలు ఆడే ఆటలో పావులుగా మిగిలిపోవద్దని వారు విజ్ఞప్తి చేశారు.
గౌరవేని ప్రవీణ్ ,బంధం నరేష్ ,మారబోయిన సమ్మయ్య, కేశవ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
వాచాతి పల్లి గ్రామ ప్రజల పోరాటానికి అభినందనలు.
