* సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్….
కొల్చారం( మెదక్) నేటి ధాత్రి:-
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయి పేట గ్రామంలో ఆదివారం ఘనంగా జరుపుకోవాలని గ్రామ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో జరగబోయే సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా గ్రామ ప్రజలకు పంచాయతీ పాలకవర్గానికి, చిన్నలకు , పెద్దలకు సద్దుల బతుకమ్మ, దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. తంగేడు పువ్వులు తాంబాలమంతా తీరో క్క రంగులతో పేర్చిన పువ్వులతో బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయ ప్రకారం పండగ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. బతుకమ్మ పండుగ నా తెలంగాణ… బంతి పువ్వులతోట నా తెలంగాణ… అని పాటలు పాడుకుంటూ సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.
* దసరా పండగ రోజు…
దసరా పండగ రోజు కొత్త బట్టలు వేసుకొని పాలపిట్టల చూసి పడుచు సప్పట్లు జొన్న కర్రల, జంబి ఆకులతో కలిసి అలాయ్ బాలాయ్ తీసుకుంటారు. జమ్మి కొట్టిన తర్వాత గ్రామ ప్రజలంతా ఊర్లోకి చేరుకుని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేసుకుంటారు