కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
తమిళనాడులోని వాచాతి గ్రామ ప్రజలపై అగైత్యాలకు పాల్పడిన గ్యాంగ్ రేపు నేరస్తులపై అక్కడి మహిళలు అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారు అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. శనివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,నేరస్తులైన పోలీసులు అడవిశాఖ రెవిన్యూ అధికారులను మద్రాస్ హైకోర్టు శిక్షించింది. అత్యాచార బాధితులకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. బాధితులైన ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. సంబంధిత కలెక్టర్ , ఎస్పీ , జిల్లా అటవీ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర్పు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం వీరిపై తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది వారి పోరాటానికి ప్రజా సంఘాలు జేజేలు అభినందనలు తెలిపాయి. 1992 జూన్ 20న అడవి పోలీసు రెవెన్యూ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్లను వెతకడానికి వాచాతి గ్రామంలోకి ప్రవేశించారని గుర్తు చేశారు. గ్రామానికి ఎర్రచందనం మగ్లీలతో ఆ గ్రామానికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ అధికారులు తప్పుడుగా వ్యవహరించారని తెలిపారు . గిరిజనులపై ఈ అధికారులు క్రూరంగా విరుచు కబడి ఇండ్లను ఆహార పదార్ధాలను పశువులతో సహా బావులను సైతం దోషం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు . 1992 నుంచి 2011 వరకు ఏఐకేఎస్ , తమిళనాడు ట్రైబల్ అసోసియేషన్ , ఐద్వా , వ్యవసాయ కార్మిక సంఘం , సిపిఎం నాయకత్వంలో సుదీర్ఘ పోరాటం జరిగిందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు బురుకల అంజయ్య, బురకల నగేష్, అంజి,స్వామి, యాదయ్య, సైదులు, నరసింహ తదితరులు ఉన్నారు.