సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో వలసలు
ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
శాయంపేట నేటిధాత్రి:
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు శనివారం రోజున బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు. తహరాపూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో రేణికుంట్ల కుమార్, కో ఆప్షన్ నెంబర్, కొమ్ముల సతీష్ బిజెపి బూత్ అధ్యక్షులు, కొమ్ముల రమేష్ బిజెపి గ్రామ పార్టీ అధ్యక్షులు, ముక్కెర నితిన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు, ముక్కెర చిన్న సదయ్య బిజెపి గ్రామ కార్యదర్శి, దొమ్మటి రాజయ్య మరియు 30 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు భూపాలపల్లి ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా రావాలని, సంక్షేమ పథకాలను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి యొక్క యోగక్షేమాలలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికలకు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ కదలి రావాలని ప్రభుత్వం చేసిన అభివృద్ధిని జరుగుతున్న సంక్షేమాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి మెతుకు తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, వైస్ ఎంపిపి రాంశెట్టి లత లక్ష్మారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, గ్రామ ఎంపీటీసీ గొట్టిముక్కల స్వాతి విష్ణువర్ధన్ రెడ్డి, హుస్సేన్ పల్లి సర్పంచ్ గుండెకారి రజిత శ్రీనివాస్,గ్రామ శాఖ అధ్యక్షులు రేణికుంట్ల సుమన్, మాజీ సర్పంచ్ జిన్న రాజేందర్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రేణికుంట్ల సదయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిమ్మల మహేందర్, పార్టీ నాయకులు కొమ్ముల సదానందం, యూత్ అధ్యక్షులు విజయ్, వార్డు సభ్యులు కొమ్ముల సంతోష్ మరియు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.