మరిపెడ నేటి ధాత్రి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ని రాంపురం గ్రామంలో గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. అమ్మవారిని లక్ష్మిదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు,అమ్మవారు శనివారం మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి 500,200, 50 రూపాయలు 20 రూపాయల నోట్లతో మొత్తం ఆరు లక్షల రూపాయలతో అలంకరించారు. గ్రామంలో శివాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మండపంలో దుర్గామాత శనివారం ధనలక్ష్మి అవతారంలో ప్రజలకు అమ్మవారు దర్శనం ఇచ్చారు, పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పెండ్లి బాపు రెడ్డి గారి జ్ఞాపకార్ధంగా కుమారులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నూతన నోట్ల కట్టలతో మహాలక్ష్మీ దేవిగా అలంకరించారు.పూజారి ఉప్పోజు సాయికుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పెండ్లి శ్రీనివాస్ రెడ్డి,రాంపల్లి నాగన్న,చిర్ర మధుసూదన్, ఈరగాని శ్రీనివాస్,ఈరగాని రమేష్,డాక్టర్ మహేష్ బాబు,ఈరగాని యాదయ్య,దోమల ఆదర్శ్,హెల్ది అశోక్,హెల్ది వెంకటేశ్వర్లు,దోమల సత్తయ్య,దోమల లక్ష్మీనారాయణ,దోమల వెంకన్న,పొడుపుగంటి సురేష్,మామిడి అంజి,రాంపల్లి సూర్య,ధోనిపెళ్లి కృష్ణ,ఈరగాని కరుణాకర్,మామిడి రమేష్,మామిడి శ్రీను,సుధాగాని రాజలింగం తదితరులు పాల్గొన్నారు.