*బోయినిపల్లి వినోద్ కుమార్
కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో 2017 లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రత్యేక చొరవతో గిరక తాటి చెట్లను నాటారు.
అవి పెరిగి పెద్దవైనవి,గౌడన్నలు తాళ్ళను గీసి కల్లు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు.సార్వత్రిక
ఎన్నికల ప్రచారంలో ఉన్న బోయిని పల్లి వినోద్ కుమార్ తాను నాటిన గిరుక తాళ్ళను గుర్తుకు చేసుకుని తాళ్ళ వద్దకు వెళ్ళి గౌడన్నలతో మాట్లాడుతూ 2017 లో నేను నాటిన గిరుక తాళ్ళ ద్వారా గౌడన్నలు ఉపాధి పొందడం సంతోషంగా ఉందని అన్నారు.
ప్రతీ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.
అనంతరం స్థానిక గీతకార్మికులు బోయినిపల్లి వినోద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.