పాలకుర్తి అభివృద్ధి ప్రధాత ను భారీ మెజార్టీ తో గెలిపించాలి

బీ.ఆర్.ఎస్వీ జిల్లా అధ్యక్షులు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్ డాక్టర్ మేడారపు సుధాకర్

పాలకుర్తి నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలపేడుతూ, ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని భారీ మెజార్టీ తో గెలిపించాలని బీ.ఆర్.ఎస్వీ జనగామ జిల్లా అధ్యక్షులు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్ డాక్టర్ మేడారపు సుధాకర్ అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని మండల బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థీ విభాగం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మేడారపు సుధాకర్ మాట్లాడుతూ పాలకుర్తి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వ రేసిడేన్సియల్ డిగ్రీ కళాశాల మంజూరు అయ్యిందని, గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు విద్యా సకాలంలో అందేలా కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ మండల కేంద్రాలలో హైదరాబాద్ నుండి పలు సాప్ట్ వేర్ కంపెనీలు, ఇతర కంపెనీలను తీసుకువచ్చి మెగా జాబ్ మేళాల ద్వారా సుమారు 5000 మంది విద్యార్థిని, విద్యార్థీ యువతకు జాబ్ లు ఇప్పించాడు అని, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం పలు నగరాలకు కోచింగ్ కోసం వెళ్లకుండా ఆ స్థాయి కోచింగ్ ను పాలకుర్తి, తొర్రూరు లలో వేల మంది విద్యార్థులకు భోజన సౌకర్యంతో పాటు ఇప్పించారని అందులో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారని ఎర్రబెల్లి దయాకర్ రావు భారీ మెజార్టీ కై బీ.ఆర్.ఎస్వీ గ్రామ గ్రామాన తిరిగి ప్రచారం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్, విద్యార్థీ నాయకులు జలగం నాగరాజు, వంగాల అశోక్, జోగు కృష్ణ, పులి రవి, తోకల శోభన్, అరుణ్, మహేష్, నవీన్, రాజు, అంజి, అరుణ్, ప్రసాద్, హరికృష్ణ, సాయి, నవీన్, భాస్కర్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!