9 బస్తాలు నాలుగున్నరకింటల బియ్యం తరుగు తో గోదాముకు లారీ.!?

 

ఎన్ని అక్రమాలు ఎన్ని రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు తెరపైకి మరో తాజా వ్యవహారం.!?

తూకం వేయకుండానే మరోసారి లారీల నుండి రేషన్ బియ్యం లారీలోకి తరలించడం ఆగడం లేదు.!?

ఇద్దరు అధికారుల గోదామ్ జిసిసి కార్యాలయానికి తనికి  ఏమైందో తెలవదు అంతా సైలెంట్.!?

రేషన్ బియ్యం అక్రమ సరఫరా లో జిసిసి కీలక పాత్ర, రేషన్ డీలర్లకు డిఆర్ డిపోలకు బెదిరింపులు.!?

మహాదేవపూర్- నేటి ధాత్రి:

లక్షల రూపాయల సొమ్ము తిన్న పానం ఒకేసారి ఆగాలంటే సాధ్యం కాదు కదా అయినా ఉన్నత అధికారుల ఒత్తిళ్లు రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ప్రధాన పాత్ర కలిగి ఉన్న జిసిసి స్టేజ్ వన్ స్టేజ్ టు కాంట్రాక్టర్లతో పాటు సివిల్ సప్లై అధికారులు ఒకవైపు జీర్ణించుకోలేకపోయినా తూకం వేసి సరఫరా చేయాల్సిన పరిస్థితి తప్పడం లేదు. కానీ ఉన్నత అధికారుల పర్యవేక్షణ ఎల్లప్పుడూ కొనసాగదు కదా ఇక ఎం ఎల్ ఎస్ కేంద్రానికి పూర్తి బాధ్యత వహిస్తున్న గిరిజన సహకార కార్పొరేషన్ అక్రమ రేషన్ బియ్యం సరఫరాలో తన పట్టును వదలకుండా అనేక చిందులు వేస్తుంది. పలు తాజాగా ఎం ఎల్ ఎస్ కేంద్రం నుండి తిరిగి లారీల్లో పెద్ద మొత్తం తరుగుతో బియ్యం సంచులు రావడం తూకం వేయకుండానే గ్రేడ్ 2 కాంట్రాక్టర్ వాహనాల లో బియ్యం సంచులను నింపి తరలించడం తిరుపతికి రావడం జరిగింది. పుష్కరకాలంగా దోచుకొని పంచి పెడుతు పోషిస్తున్న గిరిజన సహకార సంస్థ ఒకేసారి అక్రమాలను వదులుకోవడం సాధ్యం కావడం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రత్యేకంగా కమిషనర్ తో పాటు ఫుడ్ కమిషన్ అథారిటీ జిసిసి ఎండిల చొరవతో నే రేషన్ బియ్యం పెద్ద మొత్తంలో కూత అక్రమ రవాణాను అరికట్టడం సాధ్యం అయ్యేటట్టు కనబడుతుంది.

9 బస్తాలు నాలుగున్నరకింటల బియ్యం తరుగు తో గోదాముకు లారీ.!?

రేషన్ బియ్యం తరలించే క్రమంలో పుష్కరకాలంగా సంచుల్లో పెద్ద మొత్తంలో  తరుగు కోత చేస్తూ సుమారు ఒక లారీ కు ఆరు క్వింటాళ్ల వరకు రేషన్ బియ్యాన్ని తగ్గించి పక్కదారి పట్టిస్తున్నారు అన్న వాస్తవం రుజువయింది. గత నెల నుండి వరుస కథనాలతో ఎంఎల్ఎస్ కేంద్రంగా కొన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. ప్రధానంగా తూకం వేయడం తో రేషన్ డీలర్లు ఇతర ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడా రేషన్ బియ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. కానీ అనేక సంవత్సరాలుగా అక్రమాలకు బానిసై ఉన్న గ్రేట్ వన్ గ్రేడ్ 2 కాంట్రాక్టర్లు అలాగే గిరిజన సహకార సంస్థ సివిల్ సప్లై అధికారులు తొందరలో మరిచిపోయే పరిస్థితి లేదన్నట్టుగా తాజాగా ఈనెల 11వ తేదీన వచ్చిన లారీల్లో కొన్ని లారీల్లో మూడు నుండి నాలుగు చింతల తరుగుతూ రాక ఒక లారీలో మాత్రం సుమారు 9 నుండి 12 బస్తాల వరకు పరుగు వచ్చిన లారీ ఎంఎల్ఎస్ కేంద్రానికి రావడం జరిగిందన్నట్లు సమాచారం. ఇక అధికారులు మాత్రం యధావిధిగా రోజువారీ గానే ఆ లారీల్లో ఉన్నటువంటి వేబిల్ ప్రకారం బస్తాలు గోదాంలో అన్లోడ్ చేసుకుని సాగ పంపడం విశేషం. ఇలా గోదాముకు వచ్చే ప్రతి లారీ బస్తా యొక్క తరుగును తీసేసి బేబీల్లో 2009 వందల క్వింటాళ్ల బియ్యం ఉందని రికార్డు రావడంతో కాంట్రాక్టర్ మరియు సివిల్ సప్లై జిసిసి అధికారులకు వాస్తవం తెలిసినప్పటికీ కూడా లారీలను గోదాంలో అన్లోడ్ చేయడం నేటికీ కొనసాగుతుంది.

ఎన్ని అక్రమాలు ఎన్ని రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు తెరపైకి మరో తాజా వ్యవహారం.!?

రేషన్ బియ్యం సరఫరాలు పరుగు కోత పేరుతో సుమారు 15 సంవత్సరాలుగా లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని గిరిజన సహకార సంస్థ అండదండలతో సివిల్ సప్లై అధికారుల ప్రోత్సాహం గ్రేట్ వన్ గ్రేట్ టు కాంట్రాక్టర్లు పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని బుక్యారని సాక్షాలతో తెరపైకి రావడం జరిగింది. కానీ ఫుడ్ కమిషన్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లై నిర్లక్ష్యం జిసిసి కాంట్రాక్టర్ సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోకుండా ఉండడం వలన రేషన్ బియ్యానికి పక్కదారి పట్టించడంలో అడ్డుకట్ట వేయలేకపోవడం జరిగింది. ఒకవైపు తూకం వేసి ఇస్తున్నామని చెప్పుకుంటూ లారీల్లో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం తరుగు వస్తున్న జిసిసి సివిల్ సప్లై అధికారులు ఇప్పటివరకు పట్టించుకునే దాఖలాలు లేవు. ప్రతి నెల ఒకటవ తేదీ నుండి 20వ తేదీ వరకు రేషన్ బియ్యం సరఫరాలో రోజుకు ఒక వ్యవహారం తెరపైకి రావడం చూస్తే ఉన్నత అధికారులు కూడా పెద్ద మొత్తంలో జరుగుతున్న ఈ రేషన్ బియ్యం తరుగు వ్యవహారంలో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం గాక తప్పడం లేదు. తాజాగా సంచలన వార్తా కథనాలు వస్తున్నప్పటికీ కూడా గ్రేట్ వన్ గ్రేట్ టు కాంట్రాక్టర్లు మార్పు రాకపోవడం మరింత నిర్లక్ష్యం జిసిసి తన వ్యవహార శైలి మార్చుకోకుండా పాత పద్ధతిని కొనసాగించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలాగే సివిల్ సప్లై తో పాటు జిసిసి కాంట్రాక్టర్ల వ్యవహారంలో మార్పు రాకపోవడం సివిల్ సప్లై కమిషనర్ కు ఒక సవాలు విసురుతోందని చెప్పడంలో సందేహం లేదు.

తూకం వేయకుండానే మరోసారి లారీల నుండి రేషన్ బియ్యం లారీలోకి తరలించడం ఆగడం లేదు.!?

లక్షల రూపాయల సొమ్మును పక్కదారి పట్టించిన అధికారులు ప్రత్యేకంగా జిసిసి సహాయ సహకారాలతో స్టేజ్ 1 స్టేజ్ టు కాంట్రాక్టర్ల చేతివాటకం సివిల్ సప్లై అధికారుల ప్రోత్సాహం రేషన్ బియ్యం అక్రమాల్లో మాత్రం ఆగడం లేదు సివిల్ సప్లై అధికారులు ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ధ మరియు అధికారులపై చర్యలు తీసుకోకపోవడానికి నిదర్శనంగా మరో ప్రత్యక్ష సాక్ష్యం 13వ తేదీ శుక్రవారం రోజున వరంగల్ సిడబ్ల్యుసి నుండి వచ్చిన స్టేజ్ వన్ కాంట్రాక్టర్ లారీ నుండి నేరుగా స్టేజ్ టు కాంట్రాక్టర్ సంబంధించిన వాహనంలో 360 బస్తాలను జిసిసి ఎం ఎల్ ఎస్ కేంద్రం నుండి రవాణాకు సిద్ధం కావడం జరిగింది. పలువురు సమాచారం అందించడంతో నేటి ధాత్రి అక్కడికి వెళ్లి ప్రశ్నించగా ఎవరు సమాధానమిచ్చే పరిస్థితిలో లేరు సంబంధిత డీలర్లకు నేటి ధాత్రి ఫోన్లో వివరణ కూడా ఉదయం తమతో తమ్మింగ్ వేసుకున్నారని లారీలు అందుబాటులో లేవు సాయంత్రం పంపిస్తామని చెప్పడం జరిగింది అది డీలర్లు నేటి ధాత్రితో అన్నారు. ఇది జిసిసి ఎంఎల్ఎస్ కేంద్రంగా గ్రేడ్ వన్ గ్రేడ్ 2 సివిల్ సప్లై అధికారుల కుమ్మక్కు వ్యవహారం వేల టన్నుల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడంలో చేపడుతున్న వ్యవహారం ఇది. కాటాలు వేయకుండా రేషన్ డీలర్ కు తంబింగ్ ఎలా వేసుకున్నారు అది ఎలా సాధ్యం ఆన్లైన్లో ఆ డీలర్ తనకు రావలసిన రేషన్ బియ్యం గోదాములో లేనప్పుడు తంబింగ్ ఇలా చేశాడు. వరంగల్ నుంచి వచ్చిన లారీ నుండే డైరెక్ట్ గా రేషన్ డీలర్లకు పంపిస్తే డీలర్లు తంబింగ్ ఎక్కడ వేస్తారు. ఇవన్నీ కూడా అక్రమాలకు చేయుటకు సాంకేతికాన్ని కూడా వదలకుండా వాడుకుంటున్నారనేది ప్రత్యక్షంగా కనబడుతుంది.

ఇద్దరు అధికారుల గోదామ్ జిసిసి కార్యాలయానికి తనికి  ఏమైందో తెలవదు అంతా సైలెంట్.!?

తాజాగా మరో వ్యవహారం మండలమంతా కూడై కోస్తుంది రేషన్ బియ్యం అక్రమ రవాణాలో పుష్కరకాలంగా తరుగు మరియు కోత పేరుతో లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని భుక్కిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారానికి తెరపైకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఈనెల 12వ తేదీన ఓ ఇద్దరు అధికారులు గోదాం వద్దకు వచ్చి వెళ్లడం తో పాటు మరో అధికారి జిసిసి కార్యాలయంలో కూర్చోవడం తో పాటు గోదాంకు వచ్చిన అధికారి మండల కేంద్రంలోని పలు రేషన్ డీలర్ల షాపుల వద్దకు వెళ్లి కొన్ని వివరాలు అడిగినట్లు విశ్వనీయ సమాచారం. అక్రమాలు జరుగుతుంది ఎంఎల్ఎస్ కేంద్రం దీనికి వ్యవహరిస్తున్న జిసిసి కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేయాలి ఉన్నప్పటికీ కేవలం నామమాత్రంగా గోదాం మరియు జిసిసి కార్యాలయంలో కొద్దిసేపు సమయాన్ని కేటాయించి దానికంటే ఎక్కువ సమయం రేషన్ డీలర్ల దుకాణాల కు వెళ్లి తనిఖీ చేయవలసిన కారణం ఏమిటో ప్రజలకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం రేషన్ డీలర్లు వారి ఇబ్బందులను తిరిగి ఎక్కడ చెప్పుకోవద్దని ప్రత్యేకంగా మండల కేంద్రంలోని రేషన్ డీలర్ల వద్దకు ఆ అధికారులు వెళ్లడం తో డీలర్లు కాస్త బంధువులకు కూడా గురికావడం జరిగిందని తెలుస్తుంది. ఆ అధికారులు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వచ్చారా లేక మరి ఇతర వాటికి వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

రేషన్ బియ్యం అక్రమ సరఫరా లో జిసిసి కీలక పాత్ర, రేషన్ డీలర్లకు డిఆర్ డిపోలకు బెదిరింపులు.!?

సుమారు 15 సంవత్సరాలుగా గుర్తు చప్పుడు కాకుండా తరుగు మరియు కోత పేరుతో రేషన్ బియ్యం డీలర్లకు అలాగే డిఆర్ డిపోలతో పాటు ఇతర ప్రభుత్వ వసతి గృహాలు గాని అంగన్వాడి కేంద్రాలతో పాటు మధ్యాహ్న భోజన పాఠశాలలకు అందించే రేషన్ బియ్యం సరఫరా వ్యవహారంలో పెద్ద మొత్తంలో ఔకతోకలు జరుగుతున్నాయి అన్న విషయం తెరపైకి తీసుకురాకుండా ఉన్నత అధికారుల దృష్టికి పెట్టకుండా నేటి వరకు అక్రమ రేషన్ బియ్యం సరఫరా వ్యవహారంలో జిసిసి కీలకపాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎమ్ ఎల్ ఎస్ కేంద్రానికి జిసిసి పూర్తి బాధ్యత వహించడం ఈ గోదాము నుండి అనేక మార్లు రేషన్ బియ్యం స్థానికంగా విక్రయించడం లాంటి సంఘటనలు కూడా జరగకపోలేదు. కానీ తరుగు మరియు కోత వ్యవహారంలో జిసిసి నేటి వరకు నిశ్శబ్దాన్ని పాటిస్తూ సివిల్ సప్లై అధికారులు స్టేజ్ వన్ స్టేజ్ టు కాంట్రాక్టర్లకు అన్ని విధాల అండదండలు అందించిందని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు. తాజాగా జిసిసి రేషన్ డీలర్లతోపాటు జిసిసి పరిధిలో నిర్వహించబడే డిఆర్ డిపోల నిర్వాహకులకు ప్రత్యేకంగా రేషన్ బియ్యం సరఫరా వ్యవహారంలో వారికి టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని సమాచారం. చాలీచాలని జీతాలతో జీవనం కొనసాగిస్తున్న డిఆర్ డిపో సేల్స్ మేన్ లకు రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారం తిర పైకి ఎలా వచ్చింది డిఆర్ డిపో సేల్స్ మెన్లు రేషన్ బియ్యం కూత తరుగు వ్యవహారం బయటికి చెప్పడం జరిగిందని జిసిసి వారికి ఇబ్బందులకు గురి గురిచేస్తున్నట్లు విశ్వ నియమ సమాచారం. ఈ వ్యవహారాన్ని బట్టి చూస్తే
రేషన్ బియ్యం అక్రమాల్లో గిరిజన సహకార సంస్థ దగ్గరుండి లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడంలో కాంట్రాక్టర్ మరియు సివిల్ సప్లై అధికారులకు ప్రధాన పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహ పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా కమిషనర్ సివిల్ సప్లై ఫుడ్ కమిషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జిసిసి తక్షణమే స్పందించి తరుగు పేరుతో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన జిసిసి సివిల్ సప్లై కాంట్రాక్టర్లపై తక్షణమే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!