జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజవర్గం జైపూర్ మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బుధవారం రోజు నియమకమైన విషయంలో జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ప్రేమ్ సాగర్ ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్ చేతుల మీదుగా మరియు మండల అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజుద్దీన్ ఆధ్వర్యంలో జైపూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అల్లూరి స్వామి నియమక పత్రాన్ని తీసుకొని నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అల్లూరి స్వామి మాట్లాడుతూ మండల్ లో ఎస్సీలకు ఐక్యత చేస్తూ ముందుకు పోవాలని మా పెద్దల ఆదేశాల మేరకు ముందుకు పోతానని తెలియజేస్తూ నాకు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సహకరించిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సురేఖ,ప్రేమ్ సాగర్ రావు మరియు ఎస్సీ సెల్ అధ్యక్షులు మండల అధ్యక్షులు మరియు మండల యూత్ అధ్యక్షులు అసంపల్లి శ్రీకాంత్ , మండల నాయకులు పిడుగు వెంకన్న, వడ్లకొండ వెంకటస్వామి గౌడ్, మీసాల తిరుపతి మరియు పేరుపేరునా జైపూర్ మండల నాయకుల అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.