జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా
ఓటు గోప్యత పాటించేలా పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
భూపాలపల్లి నేటిధాత్రి
మంగళవారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పై మాస్టర్ ట్రైయినర్ల తో ట్రైనింగ్ అంశాల పై రివ్యూ నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు అధికారులు నిర్వహించవలసి ఉంటుందని అన్నారు.
భారత ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల పై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉంటూ పొరపాట్లు జరుగకుండా సిబ్బందికి ట్రైనింగ్ పై అవగాహన కల్పించాలని అన్నారు.
ఎన్నికల కమిషన్ వారి ఆదేశాలు తూచా తప్పకుండా నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. వీటిపై టిఎస్ఎస్ కళాకారులు లఘు చిత్రాలు చిత్రీకరించి పోలింగ్ సిబ్బందికి ప్రదర్శించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఓటు గోప్యంగా ఉంచే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, ఈవిఎం, వివిప్యాట్ యంత్రాల వినియోగం పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిపిఓ శామ్యూల్ , జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, డి.పి.అర్. ఓ. శ్రీధర్ ,సంబంధిత అధికారులు, మాస్టర్ ట్రై, టి ఎస్ ఎస్ కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.