విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సదిశ ఫౌండేషన్ నిర్వాహకులు

రామడుగు, నేటిధాత్రి:

ప్రతిభ కలిగిన విద్యార్థులను ఉచితంగా చదివించాలనే గొప్ప ఉద్దేశంతో ముందుకు వచ్చిన సదిశ ఫౌండేషన్ కు అందరూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించి వారి పాఠశాలలోని విద్యార్థులను ఈపరీక్ష రాసేల ప్రోత్సహిస్తారని సదిశ ఫౌండేషన్ నిర్వాహకులు ఆశిస్తున్నామన్నారు. కేవలం ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈపరీక్ష. పరీక్ష రాయడం కోసం పేరు నమోదు చేసుకోవాలంటే https://sadisha.org/student-registration లింక్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఆధార్, హాల్ టికెట్ తప్పక తమ వెంట తెచ్చుకోగలరని, ఈపరీక్షలో గరిష్టంగా 55 మంది విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, అమ్మాయిలకు 33 శాతం ప్రత్యేక కోటా ఉంటుందని, సీట్ల పంపిణీ జిల్లాల వారీగా ఉంటుందని, కనీసం మూడు ప్రశ్నలు చేసిన వారినే ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన విద్యార్థులకి సదిశ ఫౌండేషన్ తరపున ప్రముఖ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ హాస్టల్ తో సహా పిల్లలు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేకుండా చదివిస్తారని, ఈపరీక్షకి ఎటువంటి రుసుము లేదని, విద్యార్థులు ఉచితంగా పరీక్ష రాయవచ్చని, ఒక పాఠశాల నుండి ఎంతమంది అయినా పరీక్ష రాయవచ్చు అని తెలిపారు. రిజిస్ట్రేషన్ కి చివరి తేదీ 1నవంబర్ 2023. పరీక్షా కేంద్రం జోన్ల వారీగా https://sadisha.org/talent-test/notifications. పరీక్ష నిర్వహించే తేదీ 5నవంబర్ 2023 ఉదయం 11 గంటలకు. విద్యార్థులు పదిన్నర గంటలకి పరీక్ష కేంద్రానికి చేరకోగలరని ఆతర్వాత వచ్చిన వారికి పరీక్షకి అనుమతిలేదన్నారు. పరీక్షలో గణితం నుండి పది ప్రశ్నలు ఉంటాయని, ఇది ఓపెన్ బుక్ పరీక్ష అంటే అభ్యర్థులు తమ వెంట ఏపుస్తకమైనా తెచ్చుకోవచ్చు. సెల్ ఫోన్, క్యాలికులేటర్స్ అనుమతించబడవని, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, గుంటూరు, నాందేడ్ (మహారాష్ట్ర) జిల్లాల్లో కూడా అదే సమయానికి పరీక్ష నిర్వహించబడునని, పరీక్ష విధానం, మోడల్ పేపర్స్ కోసం https://sadisha.org/talent-test/previous-papers ను చూడవచ్చు అన్నారు. మిగతా వివరాలుకు సదిశ ఫౌండేషన్ నిర్వాహకులు గజ్జెల ప్రవీణ్ 9550895968 నంబరును సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!