మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
సోమవారం రోజు జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలకేంద్రంలో యం ఆర్ పి ఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ని.రాజాపూర్ మండలం మాదిగ చైతన్య కమిటీ అధ్యక్షులు పెరుమాళ్ళ సాయి కుమార్,
మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్బంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ,,
తెలంగాణా రాష్ట్రముతో పాటు,,,
జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న మాదిగ & ఉపకులాలకు చెందిన సామాన్యుల జీవన విధానాల గురించి కొన్ని సలహాలు సూచనలు అందివ్వటం జరిగింది,
ముఖ్యంగా!
ఏబీసీడీ వర్గీకరనే మన ఏకైక లక్ష్యంగా మనమందరం సమిష్టిగా మన పోరాటాన్ని ముందుకు కొనసాగించాలి,
కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు బలహీన వర్గాల చిరకాల కోరిక ఏబీసీడీ వర్గీకరణ చేసేంతవరకు మన పోరాటాన్ని కొనసాగించాలి ,
ఏబీసీడీ వర్గీకరణ ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుంది,
రాజ్యాంగ స్పూర్తితో మన హక్కులకై నిరంతరం కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వలపై పోరాటం కొనసాగించాలి,
రాజకీయ హక్కుల్లో కూడా మన వాటా మనం ఉపయోగించుకోవాలి,
విద్యా – ఉద్యోగాలకై శక్తి వంచన లేకుండా ప్రభుత్వాలపై ఎప్పటికప్పుడు ఒత్తిడి పెంచాలి,
ఉద్యమాల ద్వారానే సత్పలితాలు పొందగలమణి వారు ధీమా వ్యక్తం చేశారు,