శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ వెల్లడి
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-యువత ఈ రోజుల్లో ఎక్కువగా స్వయం ఉపాధి వైపే వడివడిగా అడుగులు వేస్తున్నారని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ అన్నారు.
సోమవారం లింగంపల్లి డివిజన్ బాపునగర్ లో ఎన్ ఎన్ రెడ్డి టెక్స్ట్ టైల్స్,(మేన్స్ బోటిక్ )ను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి పుస్తకాలతో కుస్తీలు పడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నామన్నారు. కానీ కొందరు యువకులు
అoదుకు భిన్నంగా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ.. తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కూడా చూపించే విధంగా ఆలోచిస్తున్నారని చెప్పారు. యువత ఎప్పుడైతే స్వయం ఉపాధి వైపు ఆలోచించడం మొదలు పెడతారో వారి ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతూ వస్తుందని వివరించారు. అలాంటి వారికి ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు ఎంతో ప్రోత్సాహకంగా నిలుస్థాయి కానీ… ప్రభుత్వం స్వయం ఉపాధి చేసుకోవాలనే వారికీ సబ్సిడీ రుణాలు అందియడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమం షాప్ యజమాని కే ఏస్ రెడ్డి, నాయకులు రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.