మాదిగ రాజకీయ పోరాట సమితి, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా గుర్రపు శ్యామ్

ఎమ్మార్పీఎస్,ఎంపిఎస్ సికింద్రాబాద్ జాతీయ కార్యాలయం నందు నియామక ఉత్తర్వులు జారీ చేసిన బి.ఎన్.రమేష్ కుమార్

వరంగల్, నేటిధాత్రి

వరంగల్ తూర్పు నియోజకవర్గం, కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన గుర్రపు శ్యామ్ మాదిగ, ఎం.ఆర్.పి.ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిపారు. సోమవారం రోజున ఎమ్మార్పీఎస్,ఎంపీఎస్ జాతీయ కార్యాలయం సికింద్రాబాద్ నందు ముఖ్య కార్యకర్తల సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు మోదుగు లాజర్ మాదిగ అధ్యక్షతన, ఎమ్మార్పీఎస్, ఎంపిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆశాజ్యోతి బి.ఎన్ రమేష్ కుమార్ మాదిగ ఆదేశం మేరకు, వరంగల్ జిల్లాకు చెందిన గుర్రపు శ్యామ్ మాదిగను, వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనట్లు నియామక పత్రం అందచేశారు. గుర్రపు శ్యామ్ మాదిగ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ కీలకమైన జిల్లా బాధ్యతలు అప్పగించిన బి.ఎన్.రమేష్ కుమార్ మాదిగకి, అలాగే జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులకు అభినందనలు తెలుపుతూ, ఎస్సీలకు ఏబిసిడి వర్గీకరణ చట్టబద్రత కొరకై, అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. జిల్లా ప్రజలను చైతన్యవంతం చేస్తూ, గ్రామస్థాయి నుండి మొదలుకొని జిల్లాస్థాయి వరకు కమిటీలను నిర్మాణం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలు మోదుగు ఇంద్ర మాదిగ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దళిత రత్న బొక్కల వెంకటస్వామి మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దల కుమార్ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికాయల చిరంజీవి మాదిగ, హనుమకొండ జిల్లా అధ్యక్షులు జేరిపోతుల విల్సన్ మాదిగ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సంపత్ మాదిగ, వరంగల్ జిల్లా మీడియా కన్వీనర్ దాసరపు సారన్న మాదిగ, హనుమకొండ జిల్లా మీడియా కన్వీనర్ జన్ను సైనిక్ మాదిగ, వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కలపల్లి రాజు మాదిగ, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మామునూరి భాస్కర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!