గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఉమ్మడి గుండాల మండలంలోని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించిన నరెడ్ల ప్రశాంత్, దేవసాని సునీల్, గుండెబోయిన రాకేష్, ఇర్ఫ కల్పన లను గుండాల మండలం యాపలగడ్డ గ్రామానికి చెందిన సివిల్ విద్యార్థి పాయం సుధాకర్ శనివారం వారిని అభినందించి పట్టు శాలువలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగంతోనే ఆగకుండా పై స్థాయి ఉద్యోగాలకు కూడా ప్రయత్నం చేసి సాధించాలని వారిని ప్రోత్సహించారు. ఇంతటి పోటీలో కూడా నెగ్గి ఉద్యోగం సాధించిన అభ్యర్థులను వారిని కనిపెంచిన తల్లిదండ్రులను కూడా అభినందించారు. మారుమూల గుండాల మండలం ఏజెన్సీ ఏరియా నుండి మా గుండాల మండలం యువకులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని అందరు కూడా కష్టపడి చదువుకొని పై స్థాయికి రావాలని ఉద్యోగాలు సాధించాలని కోరారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు ఈసం గోపయ్య ప్రమాదవశాత్తు మృతి చెందిన సంగతి విధితమే వారి కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి ప్రవీణ్ , నరెడ్ల శ్రీను,టీఎస్ నాయుడు, బబ్బులు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.