శ్రీ చైతన్య ప్రిన్సిపల్ – కరుణ బిందు.
కొంపల్లి , నేటిధాత్రి :
శ్రీ చైతన్య కొంపల్లి -2 పాఠశాల లో ఘనంగా ఎంగిలి పూలు బతుకమ్మ సంబురాలు జరిగాయి. అనంతరం ప్రిన్సిపల్ – కరుణ బిందు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మ గౌరవానికి , ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక. మన ఆడ బిడ్డల ఆత్మీయ కలయిక సంబరానికి వేదిక ఈ బతుకమ్మ అని విద్యార్థినులకు బతుకమ్మ గొప్పతనం గురించి తెలియజేశారు. అనంతరం విద్యార్థులు , ఉపాధ్యాయులను కలిసి బతుకమ్మ ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు.