వేములవాడ నేటి దాత్రి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై కదిలి కారు గుర్తును గెలిపించాలని కెసిఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి వేములవాడ పట్టణంలోని 4వ వార్డ్ మహాలక్ష్మి వీధిలో బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటేయాలి…సారు వెంటే నడవాలి అంటూ ప్రచారం నిర్వహించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ అరుణ మాట్లాడుతూ ఆపద వస్తే ఆదుకునే నాయకుడు, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ముందుకు వస్తున్న సేవకుడు లక్ష్మీ నరసింహా రావును గెలిపించి సీఎం కేసీఆర్ దగ్గరికి పంపించాలని కోరారు. అనంతరం చల్మెడ లక్ష్మీ నరసింహా రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా 4వ వార్డ్ కు వచ్చిన తనకు అపూర్వ స్వాగతం పలికిన 4వ వార్డ్ కౌన్సిలర్ మారం కుమార్ కు, వార్డ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు. వచ్చే ఎన్నికల్లో సేవ చేయాలనే ఆశయంతో ముందుకు వస్తున్నానని, ఒక్కసారి అవకాశం ఇస్తే వేములవాడను వెన్నెలవాడగా తీర్చిదిద్దుతానని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు గుడిసెల్లో, రేకుల షెడ్డులలో ఉండకూడదని, ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇళ్ళు, అర్హులైన వారికి గృహలక్ష్మీ పథకంతో లబ్ధి చేకూర్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని స్పష్టం చేశారు. వారెంటీ లేని గ్యారెంటీలతో కొంతమంది ముందుకు వస్తారని, లీడర్లు ఎవరో తెలియని నాయకులు, మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని, అవన్నీ నమ్మి మోసపోకండని, వేములవాడ ప్రజలకు ఒక్క ఎమ్మెల్యే కావాలా…? నలుగురు ఎమ్మెల్యేలు కావాలో నిర్ణయించుకునే సమయం ఆసన్నమైందని మంచిగా ఆలోచించుకొని సేవ చేసే నాయకుడిగా వస్తున్న తనకు అవకాశం ఇవ్వండని, వేములవాడ ప్రజలకు తన లాంటి వెన్నెల చూపించే నాయకుడు కావాలో…ఇతరుల వలె చుక్కలు చూపించే నాయకుడు కావాలో ఆలోచించి ఓటెయ్యండని, గెలిచిన వెంటనే 4వ వార్డ్ మహాలక్ష్మి ఆలయం ముందు రోడ్డు నిర్మాణం, ముదిరాజు సోదరులకు మిడ్ మానేరు జలాశయం హక్కుల కొరకు సభ్యత్వంతో పాటు ఇతర అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, నరాల శేఖర్, సిరిగిరి చందు, జోగిని శంకర్, గూడూరి మధు, గోపు బాలరాజు, కట్కూరి శ్రీనివాస్, ముద్రకోల వెంకన్నతో పాటు మున్సిపల్ కో-అప్షన్ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వార్డ్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.