మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి సంస్థ ఏరియాలోని కేకే 5గని పని స్థలాలను శనివారం ఏరియా జిఎం ఏ మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా గని ఉద్యోగుల భద్రత, సామర్థ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మైనింగ్ కార్యకలాపాల సంబంధించి వివిధ అంశాలను నిశితంగా పరిశీలించి, అంచనా వేశారు. గనిలో మైనింగ్ కార్యకలాపాలు, భద్రత, ఉత్పత్తి, ఇతర అంశాలు ఉన్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలే వ్యూహాలు, పరిష్కారాలను అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్లప్పుడూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధనే లక్ష్యంగా, అందరు సమిష్టి కృషితో, అంకితభావంతో పనిచేస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేకే ఏజెంట్ రాందాస్, గని మేనేజర్ భూశంకరయ్య, గ్రూప్ ఇంజనీర్ కే రాంప్రసాద్, రక్షణాధికారి సిహెచ్ రమేష్, పిట్ ఇంజనీర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.