బతుకమ్మలతో ఉపాధ్యాయులు విద్యార్థులు
– పనికర పాఠశాలలో బతుకమ్మ వేడుకలు
– బతుకమ్మ వేడుకలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.
#నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని పనికర పాఠశాలలో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ మాట్లాడుతూ బ్రతకమ్మ పండగ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ నేతృత్వంలో పాఠశాల ఉపాధ్యాయులు అనిత సుకన్య ఆధ్వర్యంలో విద్యార్థులచే బతుకమ్మను పేర్చి తీరొక్క పూలతో విద్యార్థులు బతుకమ్మలను పేర్చుకొని పాఠశాల ఆవరణలో కోలాటం ఆడారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ మాట్లాడుతూ బ్రతుకమ్మ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. నేటి నుండి పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించిననేపథ్యంలో గురువారం బతుకమ్మ వేడుకలను ఉపాధ్యాయులు పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి అనిత, డి సుకన్య పి శ్రీధర్, కే వెంకటేశ్వర్లు , విద్యార్థులు పాల్గొన్నారు.