ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు.
చేర్యాల నేటి ధాత్రి:
చేర్యాల మండలం వికాస్ గ్రామర్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఇలియస్, కరస్పాండెంట్ విజయలక్ష్మి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధించే పెద్ద పండుగని, తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి, నాగరికత, సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకునే పూల పండుగే బతుకమ్మని, ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారందరూ జరుపుకునే పూల పండుగే బతుకమ్మని, ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారందరూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. బతుకమ్మ పండుగ అంటే మహిళలందరూ సంతోషంగా ప్రకృతిలో మమేకమై జరుపుకునే అద్భుతమైన పండుగని అన్నారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడబిడ్డలకు ఎంతో సంతోషం కలుగుతుందని, బతుకమ్మ అంటే నే ఆడపడుచు, అందుకే బతుకమ్మను ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచుగా భావిస్తారన్నారు. రకరకాల పువ్వులు గానుగ పూలు, తంగేడు పూలు, బంతి పూలు, చామంతి పూలు, జిల్లేడు పూలు, గడ్డి పూలు కలిపి బ్రతకమ్మను పేర్చి, శిఖరం లేదా సిగ మీద గుమ్మడి పువ్వు ను వుంచి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. ఈ పూల పండుగ ఎంగిలిపువ్వు బతుకమ్మతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మతో ముగిసిపోతుందని తెలిపారు. తదుపరి పాఠశాల ఆవరణలో విద్యార్థులు బతుకమ్మలను పెట్టి, బతుకమ్మ పాటలు పాడి, కోలాటాలు ఆడి, నృత్యాలు చేసి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.