లక్షెట్టిపేట అక్టోబర్ 11( నేటిధాత్రి):-
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సిఐ కృష్ణ, ఎస్సై లక్ష్మణ్ లు బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరతో పాటు, ఓటింగ్ కోసం వచ్చే వృద్దులకు ర్యాంప్ సౌకర్యాలు పరిశీలించారు. అదే విధంగా పోలిన కేంద్రం గ్రామాన్ని ఎంత దూరంలో ఉంది ఏదైనా సమస్యలు ఉంటాయా అన్న కోణంలో పరిశీలించడం జరిగింది. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అన్ని కేంద్రాల వద్ద ఏర్పాట్లను చేయనున్నట్లు అధికారుల ఆదేశాల మేరకు పరిశీలిస్తున్నామన్నారు.