సింగరేణి అక్రమ భూ సర్వే ను అడ్డుకున్న రామారావు పేట రైతులు

మా భూములను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న రైతులు

జైపూర్ , నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావ్ పేట గ్రామంలో సోమవారం రోజున గ్రామంలో ఉన్న రైతులకు తెలియకుండా సింగరేణి యాజమాన్యం సర్వే పనులను ప్రారంభించింది. అదే క్రమంలో ఓసీపీకి భూములు ఇవ్వడం కుదరదని రైతులు అడ్డుకున్నారు. మంగళవారం రోజున జైపూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి యాజమాన్యం మాకు తెలియకుండ మా భూములలో సర్వే పనులు చేస్తున్నారని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఓపెన్ కాస్ట్ కి భూములు ఇవ్వకపోయినా కొత్త వ్యక్తులను తీసుకొచ్చి వాళ్లే రైతులు అన్నట్లు ఒప్పుకుంటున్నట్లు దొంగ రికార్డులు సృష్టిస్తున్నారని అన్నారు. అదే గ్రామానికి చెందిన కొందరు బీఆర్ఎస్ నాయకులు సింగరేణి యాజమాన్యానికి సహకరిస్తూ దొంగ పట్టాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదివరకే సింగరేణి కంపెనీకి ఇందారం రామారావు పేట శ్రీరాంపూర్ తాళ్లపల్లి దుబ్బపెల్లి గ్రామాలను ఓపెన్ కాస్ట్ కొరకు వెయ్యి ఎకరాల భూమిని ఇచ్చి నష్టపోయామని అన్నారు. దాని వల్ల పూర్తిగా రైతులకు ఉపాధి కోల్పోయారని ఓపెన్ క్యాస్ట్ లో జరిగే పనుల వలన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోకి కాలుష్యం ఏర్పడి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలియజేశారు. బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు పగుళ్లు తేలి కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.ఇప్పటికే విలువైన భూములు కోల్పోయామని ఇకనుండి భూములు ఇవ్వమని సింగరేణి యాజమాన్యం సర్వేలు నిలిపివేయాలని తెలియజేశారు. రైతులకు తెలియకుండా భూముల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కొంతం మధుకర్, జిట్టా తిరుమల్,పూదరి వెంకటమ్మ, గడ్డం రమేష్,సంధ్య శ్రీ, పల్లెర్ల సదానందం, ఆకుల రమేష్, పూదరి వెంకటేష్,నామాల తిరుపతి,పూదరి అభిలాష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!