జైపూర్, నేటి ధాత్రి:
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాలతో సోమవారం రోజు కాన్కూర్ గ్రామంలో ఎస్ డి ఎఫ్ నిధులతో మంజూరైన సిసి రోడ్లు మరియు నాలిలు ఎస్సీ కాలనీలోని రేగుంట మధునయ్య ఇంటి నుంచి రేగుంట సంపత్ ఇంటి వరకు రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించిన సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్ జక్కుల లక్ష్మి, వెంకటస్వామి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యాదన వేణి రమేష్, రైతు అధ్యక్షులు గుర్నా భీమారావు, వార్డు సభ్యులు రేగుంట పద్మ, రేగుంట రామచందర్, మహేష్ కాలనీవాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.