కోనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిముక్త గ్రామం లో నిర్వహించబడిన ఇట్టి పశు వైద్య శిబిరానికి గ్రామ సర్పంచ్ అనిల్, విజయ డైరీ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఈవో డి ఎల్ డి ఏ కరీంనగర్ డాక్టర్ జి శ్రీధర్, మరియు పశు వైద్య సిబ్బంది, కనక లక్ష్మి, తిరుపతి రెడ్డి, డి ఎల్ డి ఏ సిబ్బంది గోపాలమిత్ర సూపర్వైజర్ రాములు, గోపాలమిత్రులు శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రశాంత్, దినేష్, ఈ శిబిరంలో 60 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స 30 దూడలకు నట్టల నివారణ మందులు మరియు రైతులకు లింగ నిర్ధారిత వీర్యము ఉపయోగాలపై అవగాహన చేయనైనది మరియు పాడి పశువులకు పశుగ్రాస ఆవశ్యకత మీద రైతులకు వివరించనైనది.