వీణవంక. (కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో బతుకమ్మ చీరలను ఆడబిడ్డలకు ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను అందరి కి ఇవ్వాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా అందజేయడం జరుగుతుంది. అలాగే గ్రామంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బిక్షపతి, సమ్మిరెడ్డి, దూలం సమ్మయ్య ,వెంకటేష్ ,శ్రీనివాస్ రెడ్డి ,సందీప్, అనిల్ వార్డు సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.