మంత్రి కేటీఆర్ పర్యటనకు పకడ్బంది ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల (కలెక్టరేట్) సముదాయం జిల్లా పోలీస్ ( ఎస్పీ) కార్యాలయాలను మంత్రి కేటీఆర్ అక్టోబర్ 9న ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సమీకృత జిల్లా కలెక్టరేట్ ను సందర్శించి మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుందని, ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు సంక్షేమ పథకాల మంజూరు పత్రాల పంపిణీ ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాల్ పల్లి కి చేరుకుంటారని, తెలిపారు వద్ద అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, పోలీస్ శాఖ కార్యాలయం మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని, రెండవ విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు, రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులకు, గృహలక్ష్మి లబ్ధిదారులకు మంత్రి మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారని అన్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్,సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.