లక్షేట్టిపేట్ నేటిధాత్రి :
పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కాలేజ్ రెగ్యులర్ ప్రిన్సిపాల్ గా డాక్టర్ జై కిషన్ ఓజా నియమితులయ్యారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పదోన్నతులలో భాగంగా పట్టణంలోని ఆదర్శ డిగ్రీ కాలేజ్ లో ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఫిజిక్స్ అధ్యాపకులు డాక్టర్ జై కిషన్ ఓజాను రెగ్యులర్ ప్రిన్సిపాల్ గా నియమిస్తూ కమీషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజాను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల నిర్వహణ, అభివృద్ధిలో ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా సేవలు మరువలేనివన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ…. అధ్యాపక, బోధనేతర సిబ్బంది సహకారంతోనే కళాశాలను ఒక ఉన్నత స్థాయికి తీసుకువచ్చినట్లు వివరించారు. విద్యనందించడంలో ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలను మరింత మెరుగైన ఉన్నత స్థానంలో నిలపడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని, అందరూ సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగయ్య, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.