విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వ శ్రీకారం

# ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకం
# అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది
నర్సంపేట,నేటిధాత్రి :
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వ శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకం ప్రారంభమైన సందర్భంగా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ (బొంద బడి)లో కెసిఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కెసిఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకం ద్వారా 23 లక్షలకుపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుందన్నారు.ప్రభుత్వ పాఠశాలాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించి, చదువుపై దృష్టి సారించే దిశగా మరో ప్రతిష్ఠాత్మక పథకానికి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 వేలకుపైగా బడుల్లో ఈ పథకం ప్రారంభం అయ్యిందన్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు అల్పాహారం అందించనున్న కార్యక్రమంలో బ్రేక్ ఫాస్ట్ మెనూ వివరాలు…
సోమ‌వారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ ర‌వ్వ ఉప్మా, చ‌ట్నీ.
మంగ‌ళ‌వారం – పూరి, ఆలు కుర్మ లేదా ట‌మాటా బాత్ విత్ ర‌వ్వ‌, చ‌ట్నీ.
బుధ‌వారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చ‌ట్నీ.
గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగ‌ల్, సాంబార్.
శుక్ర‌వారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చ‌ట్నీ లేదా గోధుమ ర‌వ్వ కిచిడీ, చ‌ట్నీ.
శ‌నివారం – పొంగ‌ల్/సాంబార్ లేదా వెజిట‌బుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ‌. లతో
నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. ఉదయాన్నే వ్యవసాయం పనులు కూలీపనులు చేసుకోవడానికి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం మానవీయ ఆలోచనకు అద్దంపట్టే దిశగా ఈ అల్పాహారం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుంటీ రజినీ కిషన్,వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,కౌన్సిలర్స్ సాంబయ్య గౌడ్,దార్ల రమాదేవి,ఇందిరా,శీలం రాంబాబు గౌడ్,పద్మ,పాషా, విద్యాశాఖాదికారులు,పాఠశాల అధ్యాపక బృందం, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!