– ఇంచార్జి వార్డెన్లతో ప్రశ్నార్థకంగా మారుతున్న విద్యార్థుల భవిష్యత్త్
– హాస్టళ్లలో ఇంచార్జి వార్డెన్ ల
పర్యవేక్షణ కరువు.
– లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం …. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఇంచార్జి వార్డెన్లు
– మెనూ గురించి పట్టించుకునే వారు లేరు
– ఎస్సీ కళాశాల హాస్టల్లో పనిచేయని మరుగుదొడ్లు, తిరగని ఫ్యాన్లు
– ఇంచార్జి వార్డెన్లతో విద్యార్థుల సమస్యలు పట్టించుకునేదిఏరు ?
– చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు
బిఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్
స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటిధాత్రి
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ, బిసి వసతి గృహాలోని ఇంచార్జి వార్డెన్లతో విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారని, ఇంచార్జి వార్డెన్ లను తొలగించి పర్మినెంట్ వార్డెన్ లను నియమించాలని భారత రాష్ట్ర సమితి అనుబంధ విద్యార్థి విభాగం బిఆర్ఎస్వీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్ కోరారు. ఈ సందర్భంగా లకావత్ చిరంజీవి నాయక్ ఎస్సి , ఎస్టీ, బిసీ హాస్టల్ విద్యార్థులతో మాట్లాడిన అనంతరం
ఎస్సీ బాలుర కళశాల, ఎస్సీ బాలికలు, బిసి బాలుర జనరల్ హాస్టల్, బిసి బాలుర కళాశాల, బిసి బాలికల కళాశాల వసతి గృహానికి పర్మినెంట్ వార్డెన్ లు లేకపోవడంతో ఇంచార్జి పాలన కొనసాగడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే వసతిగృహాలకు పర్మినెంట్ వార్డెన్ లను నియమించాలని అన్నారు. వసతిగృహాలోని విద్యార్థులకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన వార్డెన్లు అదనపు బాధ్యతలు మూలంగా ఇంచార్జి వసతి గృహాలను పట్టించుకోవడం లేదన్నారు. పర్మినెంట్ వసతిగృహాలకే ఎక్కువ సమయం కేటాయించడం వలన ఇంచార్జి హాస్టల్లో పూర్తి స్థాయిలో వెళ్లే పరిస్థితి లేదని దీని మూలంగా విద్యార్థులకు సక్రమంగా మెనూ అమలు చేయకపోవడం దారుణమన్నారు . హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఆలనాపాలనా చూసే వారు
కరువయ్యారని అన్నారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన బాధ్యత వార్డెన్లకు ఉంటుందని గుర్తు చేశారు. అదే విధంగా ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహాంలోని ఎ ఒక్క గదిలో అసలుకే ఫ్యాన్లు ఉండకపోవడం దారుణమన్నారు. హాస్టల్ గదులలో దోమలు ఉండటం వలన విష జ్వరాలు వస్తున్నాయని ఆయన అన్నారు. మరుగుదొడ్లు , బాత్ రూం లు పనిచేయటం లేదని, దీనితో విద్యార్థులు బయటికి పోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి ఎస్సి, బిసి వసతి గృహాలకు ఇంచార్జి వార్డెన్ లను తొలగించి పర్మినెంట్ వార్డెన్ లను నియమించాలని కోరారు.