
# ఆనందోత్సవంలో విద్యార్థి సంఘాలు,విద్యార్థులు
నర్సంపేట,నేటిధాత్రి :
కార్పొరేట్ వైద్యం అందించేందుకు అలాగే నిరుపేద విద్యార్థులకు ఉన్నతమైన వైద్య విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నది.ఈ క్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట కు మెడికల్ కళాశాలను మంజూరి చేయించి నిర్మాణ పనులను ప్రారంభించారు.అందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతగా విద్యార్థి ఐక్య వేదిక సంఘాల అధ్వర్యంలో నర్సంపేట డివిజన్ పరిధిలోని బిట్స్, జయముఖి, స్థానిక డిగ్రీ, పార్మసీ, భద్రకాళి,ఎస్సార్ ఒకేషనల్ కళాశాలలకు చెందిన 6 వేల మంది విద్యార్థులు పట్టణంలోని అర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి పట్టణ ప్రధాన రహదారుల నుండి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా పలువురు విద్యార్థులు,విద్యార్థి సంఘాలు నాయకులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు అందుబాటులోకిరాని వైద్య విద్యను ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కృషితో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ ప్రాంతానికి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇప్పటికే నర్సంపేట పట్టణంలో జిల్లా ఆస్పత్రిని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పెద్ది ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందం ఉన్నదని ఆశభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వి,ఏబిఎస్ఎఫ్, పిడిఎస్యు,టిఎన్ఎస్ఎఫ్,ఏఐఎఫ్డిఎస్,పీడీఎస్యు 2,ఎంఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, అంబేడ్కర్, దళిత, గిరిజన విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.