
జైపూర్, నేటి ధాత్రి:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే కార్మికులకు వేతనాలు పెంచాలని, పెరిగిన నిత్యవసర సరుకులు ధరలు అనుగుణంగా బిల్లులు కోరుతూ 9వ రోజుకు చేరుకున్న సమ్మె చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. జైపూర్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నారు. వారు మాట్లాడుతూ కార్మికులకు న్యాయమైన డిమాండ్లను సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారికి ఫిక్స్డ్ వేతనం అందించాలని డిమాండ్ చేశారు.