స్టేషన్లో ఫైర్ స్టేషన్ ప్రారంభం

స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటిధాత్రి

స్థానికంగా ఫైర్ స్టేషన్ లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని ప్రజల చిరకాల వాంఛ నేడు తీరింది శివునిపల్లి గెస్ట్ హౌస్ లో అగ్నిమాపక కేంద్రం ప్రారంభించిన అగ్నిమాపక అధికారులు

జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని శివునిపల్లిలో గెస్ట్ హౌస్ నందు తాత్కాలిక అగ్నిమాపక కేంద్రం ప్రారంభించిన అగ్నిమాపక అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి షబ్బీర్ అలీ, ఆధ్వర్యంలో సుమారు 18 అగ్నిమాపక కేంద్రాలను వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా డిఎఫ్ఓ జయచంద్ర, ఏ డి ఎఫ్ అశోక్ రెడ్డి, అందులో ఆరు డబుల్ ఇంజన్ స్టేషన్లో 12 సింగిల్ ఇంజన్ స్టేషన్లతో ప్రారంభించడం జరిగిందని. అందులో భాగంగానే స్టేషన్గన్పూర్ ప్రజల దశాబ్దాల కల నెరవేరినట్లు అయ్యిందని. ఇంతకుముందు స్టేషన్గన్పూర్ చుట్టుపక్కల గ్రామాలలో ఏదైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే హనుమకొండ లేదా జనగామ నుండి ఫైర్ ఇంజన్లు రావాలంటే చాలా సమయం పట్టేది ఈలోపు జరగవలసిన ధన నష్టం జరిగేది కానీ ఇప్పుడు మన స్టేషన్ ఘనపూర్ లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడంవల్ల ప్రమాద స్థలానికి తక్కువ సమయంలో చేరుకొని మంటలవల్ల నష్టాన్ని నివారించడానికి అవకాశం ఉందన్న. అగ్నిమాపక అధికారులు డీఎఫ్ఓ జయచంద్ర, ఏ డి ఎఫ్ ఓ అశోక్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనాపూర్, పాలకుర్తి, జనగామ, ఆలేరు, ఎస్ ఎఫ్ ఓ లు, స్థానిక జెడ్పిటిసి స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక.రవి, శివునిపల్లి గ్రామపంచాయతీ ఈఓ శ్రీకాంత్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల.గణేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, ఎంపీటీసీ దయాకర్, వార్డ్ మెంబర్ విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *