ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్.
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా
జడ్చర్ల మున్సిపల్ పరిది లో బతకమ్మ పండగ సంబురాల సందర్భంగా కావేరమ్మ పేటలో మహిళ సమైక్య భవనంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ పాల్గొని, 3,6,8,17,23, వార్డులకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు,మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ మాట్లాడుతూ, ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ రోజు కొత్త చీర కట్టుకోవాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బతుకమ్మ కానుకగా, ఆడపడుచులకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మహిళలను గౌరవించుకునేందుకే బతుకమ్మ చీరలను మహిళా మణులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ , మున్సిపల్ వార్డు ఆఫీసర్స్ ,ఆర్ పి లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.