ప్రజల ఆశీర్వాదమే కొండంత అండ
సీఎం కేసీఆర్ చొరవతోనే నియోజకవర్గ అభివృద్ధి
ప్రజాసేవలో అలసట ఉండదు….
ప్రభుత్వ విప్ రేగా
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి…
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించి కొత్తగూడెం, ముత్తాపురం, లక్ష్మీపురం, గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేయడం జరిగింది…
కొత్తగూడెం గ్రామం లో ఆర్ &బి రోడ్డు నుండి కొరేం గుంపు వరకు సుమారు 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రత్యేక మరమ్మత్తుల పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది…
అల్లేరుగూడెం నుండి బార్లగూడెం వరకు సుమారు 2 కోట్ల 26 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు మరమ్మత్తు పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది…
ఆర్& బి రోడ్డు భట్టుపల్లి వయా వడ్డేరు గుంపు నుండి బురుదారం రోడ్డు వరకు సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది…
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ
పినపాక నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదమే తనకు కొండంతా అండ అని ఆయన అన్నారు, ప్రజల కష్టసుఖాలలో నిత్యం తోడుంటానని గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ పథకాల అమలులో ముందుంటానన్నారు, ప్రజలకు సేవ చేస్తూ అలుపు అన్నదే రావడంలేదని ఇది తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు
స్వరాష్ట్రంలో గ్రామాలలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని తెలిపారు ప్రతి మారుమూలపల్లెకు బీటి రోడ్డు వేయడంతో పాటు మౌలిక సౌకర్యాలు మెరుగుపడ్డాయి అన్నారు, ప్రజలంతా మమేకమై అభివృద్ధిలో భాగ్య స్వాములవుతున్నట్లు తెలిపారు
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు, తాను గెలిచిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్నానని అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో తెలంగాణ పల్లెలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు, సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు
గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవనాలు వైకుంఠధామాలు పల్లె ప్రకృతి వనాలు అంతర్గత సిసి రోడ్లు నూతన పాఠశాల భవనాలు మంచినీటి సాగునీటి వసతి మెరుగుపడినట్లు తెలిపారు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు
సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా అర్హులైన వారికి అందిస్తున్నామని తెలిపారు ప్రధానంగా దళిత బంధు బీసీ బందుతో పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్న దాన్ని వివరించారు పేదల కోసం పనిచేసిన ప్రభుత్వానికి ప్రజలు విధిగా మరోసారి ఆశీర్వదించాలని కోరారు…