భూపాలపల్లి నేటిధాత్రి
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రూ.25లక్షలతో నిర్మించిన రైతు వేదిక, రూ.20లక్షలతో గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి, రూ.9.90లక్షలతో యాదవ సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ దేశంలో ఎక్కడ కూడా రైతు ఒక వేదిక లేదు.దేశంలో ఎక్కడలేని విధంగ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను సంఘటితం చేస్తూ రైతు వేదికలను నిర్మించుకున్నాము.రైతు వేధికలలో రైతు తమ వ్యవసాయ అవసరాల కోసం చర్చలు జరుపుకునే అవకాశం కల్పించారు. మొగుళ్ళపల్లి మండలంలో మొత్తం 5 రైతు వేదికలు నిర్మించుకోవడం జరిగింది. దాదాపు రూ.25లక్షలతో రైతు వేడుకల్ని నిర్మించిన ఏకైక ప్రభుత్వం. ప్రతి 5వేల ఎకరాలు ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ,ఒక వ్యవసాయ అధికారిని నిర్మించుకున్నాము. రైతు లను రైతు బంధు,రైతు భీమా కల్పించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ తప్ప మరొకటి లేదు. గతంలో రైతులకు ఎరువుల కోసం బారులు తీరిన సంఘటనలు మొత్తం సమూలంగా ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన ప్రతి దాన్యాన్ని కేంద్రం సహకారం లేకున్నా వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన రైతు పక్షపాతిగా నిలిచిన ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి జోరిక సదయ్య ఎం పి పి యార సుజాత సంజీవ రెడ్డి బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బలుగురి తిరుపతి రావు ప్యాక్స్ చైర్మన్, క్లస్టర్ ప్రజా ప్రతినిధులు, మండల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.